- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక అక్రమ మైనింగ్ కేసు.. సుప్రీంకోర్టులో మరోసారి విచారణ వాయిదా
వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి వాయిదా వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి వాయిదా వేసింది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్ (JP Ventures)కు వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (National Green Tribunal) తీర్పుచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సదరు సంస్థపై దాదాపు రూ.18 కోట్ల జరిమానాను విధించింది. దీంతో గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ 2023 మే 15న జేపీ వెంచర్స్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, మరోసారి ఆ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా (Siddharth Luthra) వాదనలు వినిపించారు. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 19కి వాయిదా వేసింది.
కాగా, సెప్టెంబర్ 3న జరిగిన విచారణలో భాగంగా జేపీ వెంచర్స్‌పై గ్రీన్ ట్రైబ్యునల్ విధించిన ఎన్జీటీ రూ.18 కోట్ల జరిమానా నగదును 2 వారాల్లో డిపాజిట్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎన్జీటీ జరిమానాపై గతంలో విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. నాగేంద్రకుమార్ (Nagendra Kumar) దాఖలు చేసిన అఫిడవిట్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. అక్రమ ఇసుక తవ్వకాలపై కొంతకాలంగా నాగేంద్ర కుమార్ న్యాయ పోరాటం చేస్తున్నారు.






