- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తనకు కాకుండా చేస్తోందని.. ప్రియుడి భార్యపై ప్రియురాలు హత్యాయత్నం
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ప్రియుడి భార్యపై హత్యాయత్నానికి పాల్పడింది ఓ ప్రియురాలు. నిందితురాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాలం మారుతున్న కొద్ది సమాజంలో విలువలు పతనం అవుతున్నాయి. ప్రేమ, పెళ్లి అనే పదాలకు అర్థాలు మారిపోతున్నాయి. తాజాగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఏకంగా ప్రియుడి భార్యను హత్య చేసిందుకు కంత్రీ ప్లాన్ చేసి కటకటాల పాలైంది ఓ ప్రియురాలు. అంతా పక్కాగా స్కెచ్ వేసినా చివరి నిమిషంలో బెడిసి కొట్టడంతో అడ్డంగా బుక్కయింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‍లోని చిత్తూరు (Chittoor) జిల్లా తవణంపల్లి మండలంలో చోటు చేసుకుంది.
తన ప్రియుడు దక్కకుండా పోతాడనే భయంతో..
బోయపల్లి గ్రామానికి చెందిన దిలీప్, రోజా దంపతులు. అయితే దిలీప్‍కు అదే గ్రామానికి చెందిన భాను అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి (Extramarital Affair) దారి తీసింది. గత ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య ఎఫైర్ కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారం దిలీప్ భార్య రోజాకు తెలిసిపోయింది. దీంతో తన భర్తను రోజా నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు కొనసాగుతున్నాయి. కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో దిలీప్ తన కొద్ది రోజులుగా తన ప్రియురాలిని దూరం పెడుతూ వస్తున్నాడు. అయితే రోజా వల్లే తన ప్రియుడు తనను దూరం పెడుతున్నాడని భావించిన బాను.. రోజాపై కక్ష పెంచుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన ప్రియుడు తనకు దక్కకుండా పోతాడని భావించి ఓ కంత్రీ ప్లాన్ కు వ్యూహరచన చేసింది.
ఒంటరిగా ఉండగా ఎటాక్:
రోజాను అంతం చేస్తేనే తన ప్రియుడు తనకు దక్కుతాడని భావించిన భాను ఇక రోజాను చంపాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తన స్నేహితురాలు తులసి సహకారం తీసుకుంది. ఇటీవల రోజా ఇంట్లో ఒక్కతే ఉన్నట్లు గుర్తించిన భాను తులసితో కలిసి ఆమె ఇంటికి వెళ్లింది. అక్కడ రోజా నోట్లో గుడ్డ కుక్కి బండరాయితో తలపై మోదీ హత్య చేసేందుకు ప్రయత్నించింది. వెంటనే తేరుకున్న రోజా గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చేలోపు భాను, తులసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన రోజాను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కండీషన్ సీరియస్‍గా ఉండటంతో వేలూరు సీఎంసీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాను, తలసిపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.






