Weather:రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక.. అక్కడ పిడుగులతో వర్షాలు, మరి కొన్నిచోట్ల తీవ్ర వడగాల్పులు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది.

Weather:రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక.. అక్కడ పిడుగులతో వర్షాలు, మరి కొన్నిచోట్ల తీవ్ర వడగాల్పులు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ(సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించింది. గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంటుంది. ఓవైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా ఏపీ(Andhra Pradesh) విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని 98 మండలాల్లో ఇవాళ(సోమవారం) వడగాలులు వీస్తాయని తెలిపారు. అల్లూరు - 5, కాకినాడ - 9, కోనసీమ - 8, తూర్పు గోదావరి - 7, ఏలూరు - 8, కృష్ణా - 10, గుంటూరు - 13, బాపట్ల - 9, పల్నాడు - 5, ప్రకాశం - 6 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించారు.

అలాగే.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరోవైపు వడగాలులు వీచే భిన్నమైన వాతావరణం నెలకొంటుందని తెలిపారు. అంతేకాదు పలుచోట్ల పిడుగులు పడుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే భిన్న వాతావరణం దృష్ట్యా ప్రజల ఆరోగ్యం పై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story