- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వైసీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి..సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి,విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు ముగింపు పలికినట్లు, అదే మీ బిడ్డకు ఓటేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం బొబ్బిలి లో జరిగిన సిద్దం సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ళ కాలంలో 2 కోట్ల 70 లక్షలు డీబీటీ ద్వారా నేరుగా అక్కాచెల్లెమ్మల ఖాతాలోకి ఎలాంటి లంచాలు లేకుండా అకౌంట్‌లో వెయ్యడం జరిగిందని తెలిపారు.
అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని 2014 మేనిఫెస్టోను చూపిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి కింద నెలకు 2 వేలు రూపాయలు ఇచ్చారా అని, మహాలక్ష్మి పథకం కింద ఆడపిల్ల పుడితే 25 వేలు వేస్తామన్నారు వేశారా అని పలు ఆరోపణలు చేశారు. అలాగే ఇంటి స్థలం కింద రెండు సెంట్లు ఇస్తామని ప్రజలను చంద్రబాబు మోసం చేసిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేశారు. మరల ఈ ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ మీ ముందుకు వస్తున్నారని వారి మాటలను నమ్మవద్దని సూచించారు.
అనంతరం ఈ ఎన్నికలలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుచుకొని చరిత్ర సృష్టిస్తుందని జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బొబ్బిలి ఎంపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి శంభంగి వెంకట చిన అప్పలనాయుడు లను ప్రజలకు పరిచయం చేశారు. అనంతరం ఫ్యాన్‌ను చూపిస్తూ ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర కో కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)తదితరులు పాల్గొన్నారు.
Read More...
AP News:చిరంజీవినే అవమానిస్తారా..? సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్..!