- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Sharmila : దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి: వైఎస్ షర్మిల
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల(Assembly Budget Meetings)కు వెళ్ళే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యే(YCP MLAs)లు వెంటనే రాజీనామాలు చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmila)డిమాండ్ చేశారు

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల(Assembly Budget Meetings)కు వెళ్ళే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యే(YCP MLAs)లు వెంటనే రాజీనామాలు చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmila)డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారైనా అసెంబ్లీకి వెళ్ళాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని..సభా వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీ ఎండగట్టాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu)సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అని.. పథకాల అమలు ఎప్పుడు అని అడిగితే 9 నెలల్లో 90 కారణాలు చెప్పారని విమర్శించారు.
ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై, సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని, బీజేపీ, జనసేన, టీడీపీలను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈనెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాని..అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయాలని.. ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోండని షర్మిల కోరారు.
ఇక కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ములేదని..మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి(YS Jagan)కి నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదని షర్మిల మరోసారి తన అన్నపై ఘాటు విమర్శలు చేశారు. ప్రెస్ మీట్ లు పెట్టీ పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్ కి లేదని ఎద్దేవా చేశారు.
ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి, పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదన్నారు. ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత జగన్ కు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అసలే లేదని షర్మిల విమర్శించారు.






