- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News:‘జగన్ అమెరికాకు వెళ్తే.. మళ్ళీ తిరిగిరాడు’.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతల(TDP Leaders)పై నోరు పారేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న(Buddha Venkanna) ప్రశ్నించారు.

దిశ,వెబ్‌డెస్క్: అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతల(TDP Leaders)పై నోరు పారేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న(Buddha Venkanna) ప్రశ్నించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న నేతలు ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో లాలూచీ పడ్డట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అదానీ నుంచి రూ. 1,750 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అమెరికాలో నమోదైన కేసు విచారణకు వైఎస్ జగన్ వెళితే కనుక ఇక ఎప్పటికీ ఆయన ఏపీకి తిరిగి రాలేరని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.
అధికారం ఉందని కొడాలి నాని, వల్లభనేని వంశీ నోటికొచ్చినట్టు వాగారని మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కూడా వారికి లేదని.. అలాంటి వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పడానికి కూడా అర్హులు కాదన్నారు. వారిని చూసి పోసాని కృష్ణమురళి కూడా అడ్డగోలుగా వాగాడని విమర్శించారు. వీళ్లకు శిక్షలు పడితే ఇతరులకు గుణపాఠం అవుతుందని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.






