BREAKING: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-29 06:24:20  IST  )

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

BREAKING: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ జిల్లా కలెక్టరుగా ఉన్న షణ్మోహన్ ను ఏపీఈడీబీ సీఈఓగా బదిలీ చేసింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ ను APIIC MDగా బదిలీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టరుగా సాయికాంత్ వర్మను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. విశాఖపట్నం జిల్లా కలెక్టరుగా అభిషిక్త్ కిశోర్, కాకినాడ జిల్లా కలెక్టరుగా హరేంద్ర ప్రసాద్, అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టరుగా ఉన్న టి.నిశాంతిని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరుగా, పాఠశాల విద్యా డైరెక్టర్ గా తమీమ్ అన్సారియాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోనసీమ జిల్లా కలెక్టర్ బదిలీ నేపథ్యంలో, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ జిల్లా జాయింట్ కలెక్టరే కలెక్టర్ బాధ్యతలను (FAC) నిర్వహిస్తారని జీవోలో పేర్కొన్నారు.

Next Story