ఓఎంసీ కేసు మళ్లీ విచారణ.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్ షాక్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-07 06:38:16  IST  )

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది....

ఓఎంసీ కేసు మళ్లీ విచారణ.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి(IAS officer Srilakshmi)కి సుప్రీంకోర్టు(Supreme Court)లో బిగ్ షాక్ తగిలింది. ఓబులాపురం మైనింగ్ కేసు(Obulapuram Mining Case)ను మళ్లీ విచారించాలని ఆదేశించింది. అంతేకాదు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఆదేశాలను కొట్టివేసింది. మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్స్‌కు సంబంధించిన అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. అయితే ఈ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మళ్లీ విచారణ జరపాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Next Story