అమరావతిలో ‘ఆవకాయ’ ఫెస్టివల్: ఐఏఎస్ ఆమ్రపాలి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-12-22 15:49:26  IST  )

అమరావతి బ్రాండ్ పేరును నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో బలంగా నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

అమరావతిలో ‘ఆవకాయ’ ఫెస్టివల్: ఐఏఎస్ ఆమ్రపాలి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో అమరావతి బ్రాండ్ పేరును నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో బలంగా నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ 'ఆవకాయ' పేరుతో సరికొత్త ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం వివరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఐఏఎస్ ఆమ్రపాలి ఇవాళ వెల్లడించారు. ఐఏఎస్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. విజయవాడ కేంద్రంగా జనవరి 8 నుంచి 10 తేదీల్లో ఆవకాయ అమరావతి ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలిపారు. విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో ఈ వేడుకలు జరగనున్నాయని పేర్కొన్నారు. సాధారణంగా ఇండోర్ హాళ్లకే పరిమితమయ్యే ఇలాంటి కార్యక్రమాలను తొలిసారిగా బహిరంగ ప్రదేశాల్లో, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం ఆవకాయ ప్రత్యేకత అని మంత్రి దుర్గేష్ వివరించారు. తెలుగు నేలపై పుట్టిన కథ, కవిత, సినిమా, సంగీతం, నాటకం వంటి అన్ని కళారూపాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ‘ఆవకాయ’ అని ఆయన తెలిపారు.

Next Story