- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే మళ్లీ గుడ్ మార్నింగ్ స్టార్ట్ చేస్తా: కేతిరెడ్డి
త్వరలోనే మళ్లీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభిస్తానని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వానికి రెండేళ్ల సమయం ఇచ్చామని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: త్వరలోనే మళ్లీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభిస్తానని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వానికి రెండేళ్ల సమయం ఇచ్చామని చెప్పారు. కానీ ప్రజలకు నష్టం కలిగించడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. తనపై కబ్జా ఆరోపణలు చేశారని.. గాలి కూతలు కూసే వారు ఎప్పుడూ ఉంటారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపితే మాట్లాడే వారు లేరన్నారు. నాలుగు గోడల మధ్య చంద్రబాబుతో మాట్లాడానని రేవంత్ రెడ్డి చెప్పారని వ్యాఖ్యానించారు.
కేంద్రాన్ని ఒప్పించి మీరే ప్రాజెక్టు ఆపామని అంటున్నారు.. ఈ ప్రాంత నేతలు దీని గురించి ఏం మాట్లాడరని ప్రశ్నించారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. మళ్లీ బెంగుళూరు, కేరళ ప్రాంతానికి వలసలు వెళ్లక తప్పదని అన్నారు. గతంలో అదే విధంగా వలసలు వెళ్లారని ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదని, ఉపాధి హామీ పథకం ఎత్తేస్తే రైతులు మరియు రైతు కూలీల పరిస్థితి దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.






