- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ రోజును గుర్తు చేసుకుంటున్నాను.. నాన్న’.. వైఎస్ జగన్ ఎమోషనల్ కామెంట్స్
ఫాదర్స్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఫాదర్స్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Former CM YS Jagan) ట్విట్టర్ వేదికగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ తరుణంలో ఫాదర్స్ డే ని పురస్కరించుకుని తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్ స్మరించుకున్నారు.
ఈ క్రమంలో ‘‘అన్ని విషయాల్లో మీరే నాకు ఆదర్శం. రోల్ మోడల్. నా ప్రతి అడుగులో మేరే స్ఫూర్తి. హ్యాపీ ఫాదర్స్ డే(Happy Fathers Day)’’ అని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలో మీ చారిత్రాత్మక పాదయాత్ర రోజును గుర్తుచేసుకుంటున్నాను అని తండ్రితో ఉన్న ఫొటోను సోషల్ మీడియా(Social Media) వేదికగా వైఎస్ జగన్ పంచుకున్నారు. కాగా, 2003 ఏప్రిల్ 9న చేవేళ్లలో పాదయాత్ర ప్రారంభించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 68 రోజుల పాటు 1475 కి.మీ మేర నడిచి జూన్ 15న ఇచ్ఛాపురంలో ముగించారు.






