- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ప్రజలందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు.

దిశ, వెబ్ డెస్క్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ప్రజలందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో (X Post) శుభాకాంక్షలను పోస్ట్ చేశారు. పవిత్రమైన పండుగ సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నాం అన్నారు. శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadashi) అత్యంత ప్రీతిపాత్రమైనదని సీఎం తన పోస్టులో పేర్కొన్నారు. నేడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందరిపై ఉండాలని.. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలను తెలియజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. దేవాలయాల ప్రాంగణాలతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు తరలి వెళ్తున్నారు. భక్తులకు కోసం ప్రభుత్వం ఇప్పటికే కావాల్సిన ఏర్పాట్లను చేసింది. వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రద్దీ ఉన్న దేవాలయాల వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేసింది.






