- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి కోసం క్యాటగరైజేషన్ తీసుకొచ్చాను : సీఎం చంద్రబాబు
మాదిగ కులాల్లో చాలా మందికి ఉద్యోగాలు రావు అని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : మాదిగ కులాల్లో చాలా మందికి ఉద్యోగాలు రావు అని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు. వారికి ఉద్యోగాలు రావడానికి తాను తీసుకున్న చర్యలే కారణమని పేర్కొన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండులో కానిస్టేబుళ్లు నియామక పత్రాల పంపిణీ (Constable Appointment Orders Distribution Program) కార్యక్రమంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మాదిగలకు ఉద్యోగాలను పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యేవని పేర్కొన్నారు. చాలా వెనుకబడి ప్రాంతాల్లో ఉండడం వల్ల వారు ఇబ్బందులను ఎదుర్కొనేవారని తెలిపారు. అయితే మాదిగల కోసం తాను క్యాటగరైజేషన్ తీసుకొచ్చానని చెప్పారు. అయితే దాన్ని కోర్టు మధ్యలో కొట్టివేసిందని పేర్కొన్నారు. మరోసారి తాను అధికారం చేపట్టాక ప్రత్యేక శ్రద్ధ వహించి క్యాటగరైజేషన్ తీసుకొచ్చామన్నారు. అందుకోసం సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి పొందామని గుర్తు చేశారు. తరువాత క్యాటగరైజేషన్ ను చట్టబద్ధం చేశామని వెల్లడించారు. తాను తీసుకున్న నిర్ణయాల వల్ల నేడు చాలా మంది మాదిగలు ఉద్యోగాలు పొందుతున్నారని తెలియజేశారు. అందుకు తాను గర్వపడుతున్నానని ప్రకటించారు. ఉద్యోగాలు సాధించిన యువతను మనస్ఫూర్తిగా అభినందించారు.






