- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Sharmila: నాకు రాజ్యాలు ఏలాలని లేదు... వైఎస్ షర్మిల వ్యాఖ్యలు
నాకు రాజ్యాలు ఏలాలని లేదు.. కాంగ్రెస్ బలోపేతం మా ఏకైక అజెండా అని ఏపీపీసీ చీఫ్వైఎస్షర్మిల వ్యాఖ్యానించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : నాకు రాజ్యాలు ఏలాలని లేదు.. కాంగ్రెస్ బలోపేతం మా ఏకైక అజెండా అని ఏపీపీసీ చీఫ్వైఎస్షర్మిల వ్యాఖ్యానించారు. నెల్లూరులో ఆమె ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ జగన్ మీద మాట్లాడటం నా అజెండా కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు సూపర్ ఇమేజ్ అవసరం లేదని పేర్కొన్నారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య చనిపోవడం ఫేక్ అని అనడం తప్పు అన్నారు. జగన్ పర్యటనల కు ఎందుకు అనుమతి ఇస్తున్నారు ? ప్రజలను ఎందుకు చంపుతున్నారు అని ప్రశ్నించారు. మానవత్వం గురించి జగన్ కి మాట్లాడే హక్కు లేదన్నారు.
ఐదేళ్లు ఏళ్లు మద్యం కుంభకోణం చేసి.. ఇప్పుడు జనాల మధ్యకు రావడం విడ్డూరం అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ మూడు బీజేపీ పార్టీలే అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ కూడా బీజేపీ కి ఊడిగం చేశాడని ఆరోపించారు. రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీకి బాబు, పవన్ కూడా ఊడిగం చేస్తున్నారని అన్నారు. ఏపీలో నడుస్తున్నది డబుల్ ఇంజన్ కాదు.. ట్రబుల్ ఇంజన్ సర్కార్అని ఎద్దేవా చేశారు. ప్రతి రైతుకి 20 వేలు ఇస్తా అని ఇంత వరకు ఇవ్వలేదు. రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులు ఉంటే 45 లక్షల మందికి ఇస్తున్నాం అని చెప్తున్నారు .. తల్లికి వందనం కింద బిడ్డలను మోసం చేస్తున్నారు అని విమర్శించారు. ప్రశ్నించే మాకు కాదు నాలుక మందం.. హామీలు ఇచ్చి మోసం చేసిన మీకే నాలుక మందం అంటూ వ్యాఖ్యానించారు.






