- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను జగన్‌లా తుగ్లక్‌ని కాదు... సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
సంక్షేమంలో ఏపీ ప్రభుత్వం టాప్‌లో నిలిచిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సంక్షేమంలో ఏపీ ప్రభుత్వం టాప్‌లో నిలిచిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇవాళ ఆయన విజయనగరం (Vizianagaram) జిల్లాలోని దత్తిలో నిర్వహించిన ప్రజా వేదిక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం 16 నెలల కాలంలో పెన్షన్లకు మాత్రమే రూ.48 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వైసీపీ హయాంలో ఆనందంగా పండగ చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. కూటిమ ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ చేసి చూపించామని తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చామని గుర్తు చేశారు. రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ చేశామని అన్నారు.
స్త్రీ శక్తి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ (RTC)లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. దీపం-2 పథకంలో భాగంగా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు స్త్రీ శక్తి పథకంలో మహిళలలు రూ.10 కోట్ల ప్రయాణాలు చేశారని తెలిపారు. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు సేవలో పథకం ద్వారా రూ.15 వేలు ఇస్తామని అన్నారు. మెగా డీఎస్సీ (Mega DSC) నిర్వహించిన 15 వేల మందికి ఉద్యోగలు ఇచ్చామని వెల్లడించారు. గతంలో జగన్ పర్యటనలకు వస్తే చెట్లు నరికేవారని.. ప్రజలు జగన్ (Jagan) మీటింగ్‌ల నుంచి వెళ్లకుండా గోతులు తవ్వేవారని ఎద్దేవా చేశారు. ప్రజలకు నవ్వడానికి వీలు లేకుండా జగన్ రాష్ట్రాన్ని పాలించారని కామెంట్ చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమితో ప్రజలకు మళ్లీ స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. తాను జగన్‌లా తుగ్లన్‌ని కాదు.. మంచి పాలన అందించి రాష్ట్రాన్ని అగ్ర పథాన నిలుపుతానని అన్నారు.






