- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వనజీవి రామయ్యతో నాకు పరిచయం ఉంది.. ఆయన సలహాతోనే’: ఎమ్మెల్సీ నాగబాబు
ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ 'వనజీవి' రామయ్య మరణ వార్త బాధను కలిగించిందని జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ 'వనజీవి' రామయ్య మరణ వార్త బాధను కలిగించిందని జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను సన్మానించడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. వనజీవి రామయ్య చేస్తున్న సేవను ప్రోత్సహిస్తూ కొంత ఆర్థిక సహకారం కూడా అందజేశాం.
అప్పటికే మొక్కలు నాటే కార్యక్రమంలో నాకు ఉన్న అవగాహనతో.. రామయ్య సలహా, సంప్రదింపులతో జీడిమెట్లలోని ప్రభుత్వ భూమిలో దాదాపుగా 8 నుంచి 10 వేలకు పైగా మొక్కలు నాటి పెంచామని నాగబాబు తెలిపారు. రామయ్య లాంటి రియల్ హీరోకు పద్మశ్రీ దక్కడం అనేది ప్రకృతి పట్ల ఆయన అంకితభావం, నిబద్ధతకి నిదర్శనం అన్నారు. ఆయన నాటిన మొక్కల ద్వారా సేద తీరుతున్న, స్ఫూర్తిని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి రామయ్య మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను అని నాగబాబు పేర్కొన్నారు.






