- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘హైపర్ స్కేల్ అలర్ట్.. గేమ్ ఛేంజర్ వస్తోంది’’: Minister Nara Lokesh
విశాఖపట్నంలో ఈ రోజు(శుక్రవారం) జరుగుతోన్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు

దిశ,వెబ్‌డెస్క్: విశాఖపట్నంలో ఈ రోజు(శుక్రవారం) జరుగుతోన్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్‌గా విశాఖ తయారవుతున్నాయని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా చేస్తున్నారని తెలిపారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నాం.
ఏపీ(Andhra Pradesh)లో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే వాటిని ప్రభుత్వ పెట్టుబడులుగా భావించి వారందరికీ అండగా నిలుస్తున్నాం. 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సహకరిస్తున్నారని నారా లోకేష్ తెలిపారు. ఈ తరుణంలో గిగా డేటా సెంటర్ ఏపీకి రానుందని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వివరాలు వెల్లడిస్తామన్నారు.Link






