- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడలో ‘హైడ్రా’ తరహాలో కూల్చివేతలు! భవానీపురంలో 42 నిర్మాణాలపై బుల్డోజర్లు
విజయవాడలో ‘హైడ్రా’ తరహాలో అధికారులు పలు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడలో ‘హైడ్రా’ తరహాలో అధికారులు పలు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భవానీపురంలోని బోగినగర్ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య బుధవారం ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూవివాదంపై కోర్టు తాజాగా సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో, అధికార యంత్రాంగం బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. సొసైటీకి చెందిన భూములను కొందరు దళారులు నకిలీ/దొంగ రిజిస్ట్రేషన్లతో మూడో వ్యక్తులకు విక్రయించినట్లు విచారణలో స్పష్టమైంది. ఆ భూముల్లో పలువురు ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించుకున్నారు. 25 ఏళ్లుగా నివసిస్తున్నామని బాధితులు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు 42 నిర్మాణాలను కూల్చివేయడంతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా, పోలీసులు వారికి అడ్డుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ జీవితభారాన్ని కోల్పోయామని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆకస్మిక కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డామని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో ఇదే..






