- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త ఆత్మహత్య.. భార్యే కారణమంటూ వీడియో రికార్డ్
గుంటూరు జిల్లాలో భర్త ఆత్మహత్య చేసుకున్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur)లో భర్త ఆత్మహత్య(Husband Suicide) చేసుకున్నారు. తన చావుకు భార్యే(Wife) కారణమంటూ వీడియో రికార్డు తీశారు. అనంతరం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా ఉండవల్లి(Undavalli)కి చెందిన పోతురాజు బ్రహ్మయ్యకు, భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు భార్య తరపున వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో మనస్థాపం చెందిన బ్రహ్మయ్య మంగళవారం ఉరివేసుకుని మృతి చెందారు. అయితే అంతకుముందు వీడియో రికార్డ్ చేశారు. తన చావుకు భార్యే కారణమంటూ వీడియోలో వెల్లడించారు. దీంతో బ్రహ్మయ్య బంధువులు ఆందోళనకు దిగారు. బ్రహ్మయ్య భార్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్రహ్మయ్య డెడ్‌బాడీని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






