ప్రియుడితో భార్య రాసలీలు..రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త: తలుపు తెరిచేసరికి ప్రియుడు దుర్మరణం

by Disha Web Desk 21 |
Illegal affair
X

దిశ, డైనమిక్ బ్యూరో : క్షణిక సుఖం కోసం వివాహేతర సంబంధాలు పెట్టకుని కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.ఈ వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఇల్లీగల్ అఫైర్స్‌తో కొంతమంది సంసార జీవితాలు నాశనమైపోతుంటే.. మరికొందరు నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పెళ్లైన మహిళతో ఓ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకుని ఆ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలకేంద్రంలో పరమేశ్వరసాయి(23) భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అయితే పరమేశ్వర సాయి సతీమణి అయ్యన్నకుంటపట్టికి చెందిన బైక్ మెకానిక్ సందీప్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. పరమేశ్వరసాయి ఇంట్లోలేని సమయంలో భార్య ప్రియుడు సందీప్‌ను పిలుపించుకుని ఎంజాయ్ చేసేది. ఈ విషయం ఇరుగుపొరుగువారు భర్తకు తెలిపారు. దీంతో పరమేశ్వర సాయి భార్యను గట్టిగా మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త హెచ్చరించినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అయితే శనివారం పరమేశ్వరసాయి ఇంట్లోలేని సమయంలో ఆమె ప్రియుడు సందీప్‌కు ఫోన్ చేసి పిలుపించుకుంది. ఇద్దరూ ఏకాంంతగా ఉండగా పరమేశ్వరసాయి ఇంటికి వచ్చాడు. ఇంట్లో శబ్ధాలు రావడంతో చూశాడు. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

హత్యా? ఆత్మహత్యా?

భార్య, ప్రియుడు సందీప్‌ల రహస్యాన్ని బట్టబయలు చేయాలని పరమేశ్వరసాయి భావించాడు. ఇందులో భాగంగా ఇద్దరు ఏకాంతంగా ఉన్న గదికి తాళాలు వేసిన పరమేశ్వరసాయి ఇరుగుపొరుగు వారిని పోగు చేశాడు. ప్రజలందరి సమక్షంలో తలుపులు తెరిచి చూసేసరికి సందీప్ ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా కనిపించాడు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే సందీప్‌ది ఆత్మహత్య కాదు... హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే వివాహితతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో తీవ్ర ఆందోళనకు గురయిన సందీప్ అదే ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెుత్తానికి పోస్టుమార్టం నివేదికలో సందీప్‌ది హత్య? లేక ఆత్మహత్యగా తేలనుంది.

Next Story

Most Viewed