- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Lokesh: వంద పడకల ఆస్పత్రి.. మంగళగిరికే మణిహారం
మంగళగిరి లోని చినకాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.

దిశ, ఏపీ బ్యూరో : మంగళగిరి (mangalagiri)లోని చినకాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న వంద పడకల (hundred beds) ఆస్పత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (nara lokesh)ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఆస్పత్రి భవన నమూనాపై అధికారులతో ఆయన సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన నమూనాను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కలగా ఉన్న వంద పడకల ఆస్పత్రిని అత్యాధునిక వసతులతో దేశానికి రోల్‌మోడల్ గా తీర్చిదిద్దాలన్నారు. ప్రశాంత వాతావరణంలో వైద్యులు పనిచేసేలా, రోగులకు అత్యుత్తమ వైద్యం అందించేలా ఉండాలన్నారు. డాక్టర్లు, పేషంట్లు, విజిటర్స్ కోణంలో జోన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు. పేరెన్నికగన్న ఆస్పత్రుల భవన నమూనాలను పరిశీలించి మార్పులు, చేర్పులు చేయాలన్నారు. పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించాలని సూచించారు. సమావేశంలో ఏపీఎంఎస్ఐడీసీ సీఈ జి.సుధాకర్ రెడ్డి, ఎస్ఈ వి.చిట్టిబాబు, ఈఈ సీవీ రమణ, భార్గవ్ గ్రూప్ చీఫ్ ఆర్కిటెక్చర్ శ్రీమతి నిఖిల ఇతర అధికారులు పాల్గొన్నారు.






