దుర్గమ్మ గుడిలో తలనీలాలకు భారీ టెండర్

by Thanuru Gopichand |

వచ్చే ఏడాది తలనీలాల సేకరణకు బహిరంగ వేలం నిర్వహించగా రూ.10.10 కోట్లకు వేలంపాట (Tenders) పాడారు.

దుర్గమ్మ గుడిలో తలనీలాలకు భారీ టెండర్
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడలోని (Vijayawada) ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు (Kanaka Durgamma) భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు. ఈ తలనీలాల (Tonsures) సేకరణకు కంపెనీలు పోటీ పడుతుంటాయి. వచ్చే ఏడాది తలనీలాల సేకరణకు బహిరంగ వేలం నిర్వహించగా రూ.10.10 కోట్లకు వేలంపాట (Tenders) పాడారు. దీంతో తలనీలాల ద్వారా కనకదుర్గమ్మ గుడికి తలనీలాల ద్వారా ఆదాయం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులు సమర్పించే తలనీలాలకు టెండర్లను ఆహ్వానించారు. అందుకోసం బహిరంగ వేలంపాటు, సీల్డ్ టెండర్, ఈ టెండర్ విధానాలను అనుసరించారు. ఈ వేలంపాటలో తణుకుకు చెందిన ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ కూడా పాల్గొంది. రూ.10.10 కోట్లతో భారీ టెండర్ వేసి తలనీలాల కాంట్రాక్టును దక్కించుకుంది. దీంతో అమ్మవారి భక్తుల తలనీలాలను పోగు చేసుకునే హక్కును సంస్థ పొందినట్టైంది. అయితే వచ్చే ఏడాది నుంచి తలనీలాల సేకరణకు సంస్థ అనుమతి పొందనుంది.

గతేడాది కంటే ఎక్కువ

ఈ ఏడాది భక్తుల తలనీలాల సేకరణ రికార్డు స్థాయి ధర పలికిందని అధికారులు చెబుతున్నారు. గతేడాది రూ.6.30 కోట్లు పలికిందని పేర్కొన్నారు. ఈ ఏడాది సుమారు రూ.3.80 కోట్లు అధిక ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు. తలనీలాల వేలంపాట ద్వారా అమ్మవారికి దేవస్థానికి ఆదాయం సమకూరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Next Story