Liquor prices : పండుగ వేళ మందుబాబులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన మద్యం ధరలు

by Bhoopathi Nagaiah |

సంక్రాంతి పండుగ నేపధ్యంలో మందుబాబులకు లిక్కర్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఏకంగా ఆరు ప్రముఖ కంపెనీలు మద్యం ధరలు తగ్గిస్తోన్నట్లు ప్రకటించాయి.

Liquor prices : పండుగ వేళ మందుబాబులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన మద్యం ధరలు
X

దిశ, ఏపీ బ్యూరో : సంక్రాంతి పండుగ నేపధ్యంలో మందుబాబులకు లిక్కర్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఏకంగా ఆరు ప్రముఖ కంపెనీలు మద్యం ధరలు తగ్గిస్తోన్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తగ్గిన ధరలతోనే కంపెనీలు పండుగకు మద్యం సరఫరా చేశాయి. ఎన్నికల సమయంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగా రూ.99 కే క్వార్టర్ మద్యం విక్రయిస్తున్నారు. దీనికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన పలు మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. కాగా, మరో ఆరు కంపెనీలు ధరలు తగ్గించేందుకు ముందుకు వచ్చాయి. తగ్గించిన ధరలతోనే కంపెనీలు మద్యం సరఫరా చేస్తున్నాయి.

బ్రాండెడ్ కంపెనీల మధ్య పోటీ

ఏపీలో రూ.99 మద్యంకు భారీ డిమాండ్ ఉంది. దీంతో తక్కువ ధరలు ఉన్న మద్యం బ్రాండ్ల సేల్స్ అమాంతం పెరిగింది. మరోవైపు ప్రముఖ కంపెనీలు ధరలు తగ్గించి సేల్స్ పెంచుకోవడంతో ఆ ఎఫెక్ట్ ఇతర కంపెనీల పైన పడింది. దీంతో ఆ కంపెనీలు సైతం ఇప్పుడు ధరల తగ్గింపునకు ముందుకు వస్తున్నాయి. ఇదే సమయంలో అధిక ధరలు విక్రయాలు చేసినా, బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఫలితంగా మద్యం విక్రయాలపైన నిఘా పెరిగింది. దీంతో ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకునే విధంగా కంపెనీలు ముందుకు వెళ్తున్నాయి.

తగ్గించిన ధరలు ఎలా ఉన్నాయంటే..

తాజా పరిణామాలతో మద్యం ధరలు తగ్గాయి. లిక్కర్‌ బ్రాండ్లలో క్వార్టర్‌పైనే రూ.20 నుంచి రూ.80 వరకు ధరలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మాన్సన్‌ హౌస్‌ (Mansion House)కంపెనీ క్వార్టర్‌ సీసాపై రూ.30 తగ్గించింది. అదే విధంగా అరిస్ర్టోకాట్‌ ప్రీమియం (Aristocrat Premium)సుపీరియర్‌ విస్కీ ధర ఏకంగా రూ.50 తగ్గింది. కింగ్‌ఫిషర్‌ బీరు(Kingfisher beer) రూ.10 తగ్గింది. బ్యాగ్‌పైపర్‌ గోల్డ్‌ రిజర్వ్‌ విస్కీ (Bagpiper Gold Reserve Indian Whisky )ఒకేసారి రూ.80 తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసింది. కంపెనీలు ధరలు తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గతాయనే వాదన ఉంది. కంపెనీల కంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతుందని చెబుతున్నారు. కానీ, మందు బాబులకు మాత్రం ధరల తగ్గింపుతో ఖుషీగా ఉన్నారు.

Next Story