Excise Department: ఈ ఏడాది రాష్ట్రానికి భారీగా మద్యం ఆదాయం.. కారణం ఇదేనా!?

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో మద్యం ఆదాయం పై ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది.

Excise Department: ఈ ఏడాది రాష్ట్రానికి భారీగా మద్యం ఆదాయం.. కారణం ఇదేనా!?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మద్యం ఆదాయం పై ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఏపీ(Andhra Pradesh)లో మద్యం అమ్మకాల(Alcohol sales) ద్వారా భారీ ఆదాయం సమకూరింది అని తెలిపింది. ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం 2023-24 లో మద్యం పై రూ.25,082 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది 14 శాతం పెరిగిందని తెలిపారు. 2024-25 ఏడాదికి గాను రూ.28,842 కోట్ల ఆదాయం వచ్చినట్లు తాజాగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ(Excise Department) వెల్లడించింది.

పన్నుల రూపంలో రూ.24,731 కోట్లు వైన్స్(Wines), బార్లు(Bars), డిస్టలరీలు(Distilleries) లైసెన్స్ ఫీజుల(License Fees) రూపంలో రూ.2,206 కోట్లు, దరఖాస్తు రుసుముల రూపంలో రూ.1,905 కోట్లు వచ్చినట్లు వివరించింది. ఈ క్రమంలో ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో 14 శాతం వృద్ధి సాధించినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. అయితే.. గత వైసీపీ ప్రభుత్వంలో దూరమైన బ్రాండెడ్ మద్యాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు మద్యం దుకాణాలు టెండర్ల విధానంలో కేటాయించారు. జాతీయ కంపెనీలు తయారు చేసే క్వార్టర్‌ రూ.99 బ్రాండ్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో భారీగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.

Next Story