తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

by velandi.Saikiran |

వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో రద్దీ ఎక్కువైందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
X

దిశ‌, వెబ్ డెస్క్: తిరుమల వెళ్లే వారికి బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో రద్దీ ఎక్కువైందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 15 గంటల పాటు సమయం పడుతోంది. అటు కొండపైనే ఉన్న కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకు శ్రీవారి భక్తులు వేచి ఉన్నారు.

ఇక గడిచిన 24 గంటల్లో 80,350 మంది భ‌క్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 36, 597 మంది తలనీలాలు సమర్పించారు. అదే సమయంలో తిరుమల హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు వచ్చిందని అధికారికంగా టీటీడీ ప్రకటన చేసింది. వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే తిరుమలలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వివరించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు.

Next Story