తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే..

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ (Tirumala Devotees Rush) భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో మొక్కులు చెల్లించుకుని, స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు.

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ (Tirumala Devotees Rush) భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో మొక్కులు చెల్లించుకుని, స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Queue Complex)లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో భక్తుల క్యూలైన్ వెలుపలికి వచ్చింది. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) తెలిపింది. స్వామివారి సర్వదర్శనానికి కృష్ణతేజ అతిథిగృహం వరకూ భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 87,347 మంది స్వామివారిని దర్శించుకున్నారు.39,490 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Next Story