సినిమా కలెక్షన్లను తలపించిన ‘ఆర్టీసీ’ సంక్రాంతి ఆదాయం.. మొత్తం ఎన్ని రూ.కోట్లు వచ్చాయంటే..?

by Gantepaka Srikanth |

సంక్రాంతి(Sankranti) పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC) ప్రత్యేక బస్సులు నడిపిన సంగతి తెలిసిందే.

సినిమా కలెక్షన్లను తలపించిన ‘ఆర్టీసీ’ సంక్రాంతి ఆదాయం.. మొత్తం ఎన్ని రూ.కోట్లు వచ్చాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి(Sankranti) పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC) ప్రత్యేక బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7200 బస్సులు ఏర్పాటు చేయగా.. ఏకంగా రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. దాదాపు 4 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణించినట్లు చెప్పుకొచ్చింది. ఇంకా తిరుగుప్రయాణాలు ప్రారంభం కాకపోవడంతో మరింత సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఏపీఎస్ ఆర్టీసీ నడిపిన 7200 ప్రత్యేక బస్సుల్లో 2153 కేవలం హైదరాబాద్(Hyderabad) నుంచే ఉన్నాయి.

అలాగే బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 బస్సులు ఉన్నాయి. మిగిలిన సర్వీసులు ఇతర ప్రాంతాల నుంచి నడపనున్నారు. అలాగే ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ సంక్రాంతి ప్రయాణికులు తిరిగి వెళ్లేందుకు వీలుగా 3200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటిలో అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని చెప్పారు. మరోవైపు సంక్రాంతి స్పెషల్‌గా పలు ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులోకి తెచ్చారు. రెండువైపులా ప్రయాణాలకు టికెట్లు ముందుగానే బుక్ చేసుకుంటే మొత్తం ఛార్జీలో 10 శాతం రాయితీ ప్రకటించారు.

Next Story