- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీరాజ్ శాఖకు భారీగా నిధులు.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్ల మొత్తం వ్యయంతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థికశాఖ మంత్రి పవ్యావుల కేశవ్‌కు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్ల మొత్తం వ్యయంతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థికశాఖ మంత్రి పవ్యావుల కేశవ్‌కు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బడ్జెట్ గ్రామం నుంచి గ్లోబల్ స్థాయి వరకు, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, యువత, మహిళా సాధికారత, సాంకేతికత ఇలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే 360° సమతుల్య గ్రోత్ మోడల్‌గా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని చెప్పారు.
ముఖ్యంగా పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.22,942 కోట్లు కేటాయింపులు జరపడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకం అనే విషయాన్ని NDA రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. తద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలు, గ్రామీణ రహదారులు, ఇంటింటికీ తాగునీటి సదుపాయం, ఉపాధి అవకాశాలు, స్థానిక పాలన బలోపేతం ద్వారా గ్రామాల ఆర్థిక పరిపుష్టికి ఈ కేటాయింపులు దోహదం చేయనున్నాయి. అలాగే పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.714 కోట్లు కేటాయింపు ద్వారా 2030 నాటికి 37% గ్రీన్ కవర్, 2047 నాటికి 50% గ్రీన్ కవర్ సాధించి “హరిత ఆంధ్రప్రదేశ్” దిశగా చర్యలు చేపట్టేందుకు, వన్యప్రాణుల, అటవీ సంపద రక్షణకు మరింత చేయూత ఇవ్వనుంది.






