అమరావతిలో క్వాంటం సెంటర్ నిర్మాణం.. భారీగా నిధులు మంజూరు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-09 09:53:10  IST  )

అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.

అమరావతిలో క్వాంటం సెంటర్ నిర్మాణం.. భారీగా నిధులు మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(Amaravati Quantum Computing Center) నిర్మాణానికి గతంలోనే ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సెంటర్ డిజైనింగ్-బిల్డింగ్‌కు ప్రభుత్వం తాజాగా రూ. 137 కోట్లు నిధులు మంజూరు చేసింది. అంగీకార పత్రాన్ని జారీ చేయడానికి CRDAకి అనుమ‌తులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అధికారికంగా నిధులు విడుదల


రాజధాని అభివృద్ధిలో భాగంగా క్వాంటం కంప్యూటేషన్ సెంటర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2025, నవంబర్ నెలలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ మోడ్ ద్వారా టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అనుమతించింది. సీఆర్డీఏ అధ్వర్యంలో ఈ ప్రక్రయను కొనసాగించాలని ఆదేశాలిచ్చింది. దీంతో భవనం ఏర్పాటుతో పాటు డిజైన్‌పై కసరత్తులు చేశారు. వ్యయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించారు. ఈ మేరకు తాజాగా నిధులు మంజూరు చేయడంతో పాటు సీఆర్డీఏకు అనుమతిలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story