Fire Accident: విజయవాడ లో భారీ అగ్ని ప్రమాదం.. అదుపులోకి రాని మంటలు.. ప్రాణనష్టం..?

by Indraja |

విజయవాడలోని ఆటోనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Fire Accident: విజయవాడ లో భారీ అగ్ని ప్రమాదం.. అదుపులోకి రాని మంటలు.. ప్రాణనష్టం..?
X

దిశ వెబ్ డెస్క్: విజయవాడలోని ఆటోనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్ లో ఉండే ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ కావడంతో మంటలు ఉవెత్తున ఎగసిపడుతున్నాయి. ఇక మంటల కారణంగా ఆ ప్రాంతం చుట్టుపక్కల దట్టంగా పొగ అలుముకుంది. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడం, చుట్టూ దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు.

వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బందికి సమాచారం అందిచారు. ఇక స్థానికుల సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయిత్ మంటలు అంటుకుంది ఆయిల్లో గోడౌన్ అవడం కారణంగా మంటలు అదుపులోకి రావడం లేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారాణాలు, అలానే ఆయిల్ గోడౌన్ కి లైసెన్సు ఉందా లేదా అనే విషయాలను సేకరిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Next Story