రాష్ట్రంలో షాకింగ్: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది.

రాష్ట్రంలో షాకింగ్: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. నిల్వ ఉంచిన బాణసంచా పేలి పోలీస్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో చల్లపల్లి ఎస్‌ఐతో పాటు నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు. గాయపడిన వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి కారు దెబ్బతిన్నది. ఘటనాస్థలాన్ని సీఐ కేఎస్​ రావు పరిశీలించారు. పేలుడుకు గల కారణాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఐ పరామర్శించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story