- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో భారీ ఎన్కౌంటర్.. పెరిగిన మావోయిస్టుల కదలికలు! పాడేరు ఏజెన్సీలో హై అలర్ట్
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇవాళ ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇవాళ ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మవోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్టుగా సమాచారం.. ఈ నేపథ్యంలోనే పాడేరు ఏజెన్సీలో పోలీసు అధికారులు ప్రస్తుతం హై అలర్ట్ ప్రకటించారు. ఏవోబీలో నిఘా పెంచారు. పాడేరు పరిధిలో తిరిగే వాహనాల తనిఖీలు చేపట్టారు. మరోవైపు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు.
Read More... విజయవాడలో మావోయిస్టుల కలకలం.. బిల్డింగ్లో 10 మంది మావోయిస్టులు
Next Story






