- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో భారీ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ.. ఉద్యోగావకాశాలు
ఏపీలో రూ.765 కోట్ల పెట్టుబడితో మల్టీ లేయర్ ప్రింటెండ్ సర్క్యూట్ బోర్డు (PCB) తయారీ యూనిట్ ను సైర్మా స్ట్రాటెజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయనుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో రూ.765 కోట్ల పెట్టుబడితో మల్టీ లేయర్ ప్రింటెండ్ సర్క్యూట్ బోర్డు (PCB) తయారీ యూనిట్ ను సైర్మా స్ట్రాటెజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ కాంపోనెంట్ స్కీం (Electronics Manufacturing Component Scheme) కింద ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. అందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్టవ్ వెల్లడించారు. ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమ ద్వారా 955 మందికి ఉద్యోగావకాశాలు (Employement) లభిస్తాయన్నారు. అంతేకాకుండా రూ.6,933 కోట్లు విలువ చేసే ఉత్పత్తులు తయారు చేస్తారని తెలిపారు.
అయితే ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీంలో భాగమైన తమిళనాడులో కేనెస్ సర్క్యూట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నాలుగు యూనిట్లు, అస్సెంట్ సర్క్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరో యూనిట్ కలిపి మొత్తం రూ.4,271 కోట్ల పెట్టుబడితో 5 యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయని కేంద్రమంతి పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎఫ్ లిమిటెడ్ (SRF Limited) అనే మరో సంస్థ రూ.496 కోట్లతో మధ్యప్రదేశ్‌లో ఒక యూనిట్ నెలకొల్పనుంది. ఈ యూనిట్ల ద్వారా దేశీయంగా కాపర్‌క్లాడ్ లామినేట్ 100శాతం, పీసీబీకి ఉన్న డిమాండ్‌లో 20శాతం, కెమెరా మాడ్యూల్స్‌లో 15శాతం అందుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ ప్రకటించారు. మొత్తంగా మూడు రాష్ట్రాల్లో రూ.5,500 కోట్ల పెట్టుబడితో ఏడు ప్రాజెక్టులను చేపట్టనున్నారు.






