- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG BREAKING: గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు
గ్రామ, వార్డు సచివాలయ(Village and Ward Secretariat) ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు సచివాలయాల్లో RTGS ఏర్పాటు పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన క్యాబినెట్‌లో(Cabinet Meeting) చర్చ జరిగింది.

దిశ,వెబ్‌డెస్క్: గ్రామ, వార్డు సచివాలయ(Village and Ward Secretariat) ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు సచివాలయాల్లో RTGS ఏర్పాటు పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన క్యాబినెట్‌లో(Cabinet Meeting) చర్చ జరిగింది. అటు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూముల పై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైసీపీ(YSRCP) హయాంలో దాదాపు ఏడు లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం(AP Government) గుర్తించింది. వాటిపై ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది.
ఇదిలా ఉంటే.. 14 వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజిస్తామని మంత్రి పార్థసారథి(Minister Parthasarathy) వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వాటిలో 11 మంది చొప్పున సిబ్బందిని కేటాయించింది. ఇకపై 3,500+ జనాభా పరిధిలో ఉన్న సచివాలయంలో 8 మంది, 2,500+ ఉన్న చోట ఏడుగురిని, మిగతా వాటిలో ఆరుగురు సిబ్బందిని ఉంచుతామని పేర్కొన్నారు. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, పట్టణాల్లో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్ గా ఉంటారు అని మంత్రి పేర్కొన్నారు.






