కాఫీ తోటల్లో 749 కిలోల గంజాయి... నిందితుల పరారీ

by Vemula.Srinu Prasad |

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు....

కాఫీ తోటల్లో 749 కిలోల గంజాయి... నిందితుల పరారీ
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharama Raju District) ముంచంగిపుట్టు మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారీ ఎత్తున గంజాయి(Ganja)ని స్వాధీనం చేసుకున్నారు. పనసపుట్టు పంచాయతీ పరిధిలోని సంఘం వలస గ్రామ సమీపంలో ఉన్న కాఫీ తోటల్లో(Coffee Plantations) నిల్వ ఉంచిన సుమారు 749 కిలోల గంజాయిని ఎస్సై నాని తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. నిందితులు ఈ గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు సిద్ధం చేయగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి దీనిని అదుపులోకి తీసుకున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు...

పోలీసుల అంచనా ప్రకారం స్వాధీనం చేసుకున్న ఈ గంజాయి విలువ సుమారు రూ. 3.45 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేసే క్రమంలోనే వీటిని తోటల్లో దాచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంచంగిపుట్టు పోలీసులు, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏజెన్సీలో గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరించారు.

Next Story