PM Modi:అమరావతిలో ప్రధాని మోడీ.. లేటెస్ట్ షెడ్యూల్ ఇదే!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-02 08:10:07  IST  )

అమరావతి పునర్నిర్మాణ పనులకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ మేరకు రెండు గంటలపాటు ఇక్కడ ఉండనున్నారు.

PM Modi:అమరావతిలో ప్రధాని మోడీ.. లేటెస్ట్ షెడ్యూల్ ఇదే!?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతి పునర్నిర్మాణ పనులకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ మేరకు రెండు గంటలపాటు ఇక్కడ ఉండనున్నారు. మధ్యాహ్నం 2:55 గంటలకు ప్రధాని మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3:15 గంటలకి సచివాలయం దగ్గరికి ప్రధాని మోడీ చేరుకుంటారు. హెలిప్యాడ్‌ దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి ప్రధాని చేరుకుంటారు. పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు చేస్తారు. సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం 4:55 గంటలకి గన్నవరం వెళ్తారు. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.

Next Story