- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరం.. నల్లమందు తిన్న ఆవుకు గాయం
అడవి పందుల కోసం పెట్టిన పేలుడు పదార్థం తిని గాయపడిన గోవు.

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు (Chittoor) జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలంలో ఘోరం జరిగింది. నల్ల మందు తిన్న ఓ ఆవుకు తీవ్ర గాయం అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం కొండేపల్లె పంచాయతీ పరిధిలోని పోలి నాయుడు పల్లె (Poli Naidu Palle) గ్రామానికి చెందిన పాడి రైతుకు చెందిన ఆవు (Cow) మేతకు వెళ్లింది. మేత కోసం వెళ్లిన సమయంలో పొరపాటున నల్లమందు తినింది. దీంతో ఒక్కసారిగా అది పేలి నోటికి తీవ్రగాయమైంది. ఆవు దవడ భాగమంతా దెబ్బతిని రక్తసిక్తమైంది. అది గమనించిన రైతు లబోదిబోమన్నాడు. తన పాడి ఆవుకు గాయం కావడం పట్ల ఆవేదనను వ్యక్తం చేశాడు. ఎటూ పాలుపోని స్థితిలో కన్నీరుమున్నీరు అయ్యాడు. అయితే గ్రామం సమీపంలోని పరిసర ప్రాంతాల్లో అడవి పందుల వేట సాగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. వాటి వేట కోసం వేటగాళ్లు నల్లమందుతో కూడిన పేలుడు పదార్థాలు అమరుస్తున్నారని చెబుతున్నారు. వెదురుకుప్పం, గంగాధర నెల్లూరు, శ్రీరంగరాజపురం మండలాల్లో వేటగాళ్లు సంచరిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అనధికారికంగా నల్లమందును వినియోగించడం వల్ల పాడి పశువుల ప్రాణాలకు హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.






