- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Honor Killing : చిత్తూరులో పరువు హత్య!
ఏపీ(AP)లోని చిత్తూరు(Chithur) జిల్లాలో పరువు హత్య(Honor Killing) జరిగినట్టుగా పోలీసులు అనుమనిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని చిత్తూరు(Chithur) జిల్లాలో పరువు హత్య(Honor Killing) జరిగినట్టుగా పోలీసులు అనుమనిస్తున్నారు. చిత్తూరు పట్టణానికి చెందిన యాస్మిన్ భాను.. అదే జిల్లాలోని పూతలపట్టుకు చెందిన సాయితేజను ప్రేమించింది. ఇరు కుటుంబాలు వీరి వివాహానికి ఒప్పుకోకపోవడంతో గత ఫిబ్రవరిలో ఇద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి నెల్లూరులో ప్రేయమ్ వివాహం చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా ఇటీవల తండ్రికి సీరియస్ గా ఉందని కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో యాస్మిన్ ఇంటికి వెళ్ళింది. అయితే మారుసతిరోజు యాస్మిన్ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. ప్రేమ వివాహం చేసుకొని పరువు తీసావని తండ్రి తిట్టడంతో, మనస్తాపం చెంది రాత్రి తన గదిలో ఉరి వేసుకుందని తల్లి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది.
అయితే ఆ గదిలో ఉరి వేసుకున్న ఆనవాళ్ళు ఏమీ లేకపోవడంతో అనుమానించిన పోలీసులు యస్మిన్ తల్లిని, సోదరిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రితో పాటు పలువురు బంధువులు పరారీలో ఉన్నట్టు తెలిపిన పోలీసులు.. వారికోసం గాలిస్తున్నామన్నారు. ఈ కేసును పరువు హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు చిత్తూరు పోలీసులు పేర్కొన్నారు.






