Home Minister Anita:చిన్నారిపై లైంగికదాడి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఇటీవల మూడేళ్ల బాలికపై లైంగిక దాడి(sexual assault) ఆపై హత్య జరిగిన సంగతి తెలిసిందే.

Home Minister Anita:చిన్నారిపై లైంగికదాడి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవల మూడేళ్ల బాలికపై లైంగిక దాడి(sexual assault) ఆపై హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్పందించి నిందితుని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేడు(ఆదివారం) హోం మంత్రి అనిత(Home Minister Anita) బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మూడున్నరేళ్ల చిన్నారిని లైంగికదాడి(sexual assault) చేసి, హతమార్చి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టాడో కామంధుడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం లో లైంగిక దాడికి గురైన చిన్నారి కుటుంబాన్ని హోం మంత్రి అనిత పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అంతకుముందు చిన్నారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని, చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story