జగన్‌కు కేజీకి, టన్నుకు తేడా తెలియదు: హోంమంత్రి అనిత సెటైర్స్

by Vemula.Srinu Prasad |

వైఎస్ జగన్‌కు కేజీకి, టన్నుకు తేడా తెలియదని హోంమంత్రి వంగపూడి అనితసెటైర్లు వేశారు..

జగన్‌కు కేజీకి, టన్నుకు తేడా తెలియదు: హోంమంత్రి అనిత సెటైర్స్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్‌(Ys Jagan)కు కేజీకి, టన్నుకు తేడా తెలియదని హోంమంత్రి వంగపూడి అనిత(Home Minister Anitha) సెటైర్లు వేశారు. విజయనగరం జిల్లా గణపతినగరం వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’(Suparipalanalo Tholi Adugu), ‘అన్నదాత సుఖీభవ’(Annadata SuKhibava) కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. పొగాకు, మామిడి రైతులను జగన్ పరామర్శించిన విధానంపై అనిత స్పందించారు. పొగాకు రైతుల వద్దకు వెళ్లిన జగన్‌కు కేజీకి, టన్నుకు తేడా తెలియకుండానే మాట్లాడారని ఎద్దేవా చేశారు. మామిడి రైతుల దగ్గరకు వెళ్లి మామిడి కాయలను ట్రాక్టర్లతో తొక్కిన ఘనత మాజీ సీఎం జగన్‌కే దక్కుందని ఎద్దేవా చేశారు. రాజకీయం కోసం వ్యవసాయాన్ని వైసీపీ నాయకులు అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. వైసీపీ నేతలు అడ్డుతగులుతున్నారని అనిత మండిపడ్డారు. వ్యవసాయంపై రాష్ట్రంలో రీ సర్వే చేపట్టి రైతుల ఇబ్బందులను తొలగిస్తామని అనిత హామీ ఇచ్చారు.

Next Story