Ap News: పోలీసులకు హోంమంత్రి వార్నింగ్

by Vemula.Srinu Prasad |

పోలీసులు ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే చర్యలు తప్పవని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు...

Ap News: పోలీసులకు హోంమంత్రి వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసులు ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే చర్యలు తప్పవని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) హెచ్చరించారు. విజయవాడ సబ్ జైలు(Vijayawada Sub Jail)ను ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అధికారులపై వస్తున్న ఆరోపణలపై జైలు రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం వంగలపూడి అనిత మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని సూచించారు. పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే ఎప్పటికైనా చర్యలు తప్పవన్నారు. అధికారులను బెదిరించి జగన్ ప్రభుత్వం(Jagan Government) వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని హోంమంత్రి విమర్శించారు.

కాకినాడ పోర్టు(Kakinada Port) విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Vijayasai Reddy)పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని, కానీ తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిదికాదన్నారు. విజయసాయిరెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కాకినాడ పోర్టు కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు. రెండు రోజుల్లో నివేదిక వస్తుంది త్వరలోనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుపై మాట్లాడే స్థాయి విజయసాయిరెడ్డిది కాదన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను జగన్ అండ్ కో దోచుకుందని ఆరోపించార. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) నాయకులు గత ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు.

Next Story