- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు.. విచారణకు ఆదేశం
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు చేస్తూ హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన రౌడీషీటర్ పెరోల్ వ్యవహారంపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. శ్రీకాంత్ పెరోల్ తక్షణమే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తమకు తెలియకుండా పెరోల్ ఇవ్వడంపై విచారణకు ఆదేశించారు. మంగళవారంలోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. కాగా వ్యక్తి హత్య కేసులో జీవిత ఖైదుగా ఉన్న నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పెరోల్‌కు సిఫార్సు చేశారు. దీంతో శ్రీకాంత్‌కు హోంశాఖ సెక్రటరీ పెరోల్ మంజూరు చేశారు. అయితే రౌడీ షీటర్‌కు పెరోల్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు ప్రభుత్వం సీరియస్ అయింది. శ్రీకాంత్ దందాలపై నివేదిక ఇవ్వాలని హోంమంత్రిని ఆదేశించింది. దీంతో హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. వెంటనే యాక్షన్ తీసుకున్నారు.
Next Story






