- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయి సాధన చిండ్ ఫండ్ బాధితులకు హోంమంత్రి కీలక హామీ
సాయి సాధన చిట్ ఫండ్ (Sai Sadhana Chit Fund) బాధితులకు హోంమంత్రి వంగళపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) కీలక హామీ (Assurance) ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: సాయి సాధన చిట్ ఫండ్ (Sai Sadhana Chit Fund) బాధితులకు హోంమంత్రి వంగళపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) కీలక హామీ (Assurance) ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆమె తెలిపారు. పల్నాడు జిల్లా (Palnadu District) నర్సరావుపేట (Narsarao peta) లో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులు కొందరు వ్యక్తుల నుంచి డబ్బు తీసుకొని బోర్డు (Board) తిప్పేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ చిట్ ఫండ్ (Chit Fund) లో డబ్బులు (Money) జమ చేసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని (AP Government) అర్జిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు నరసరావు పేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు (Chadalawada Aravinda Babu) తో కలిసి విజయవాడ (Vijayawada)లోని క్యాంపు కార్యాలయం (Camp Office)లో హోం మంత్రి అనితను కలిశారు. నర్సరావుపేటలో బోర్డు తిప్పేసిన సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సుమారు రూ.200 కోట్ల మేర మోసం జరిగిందని.. బాధితుల్లో పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని హోంమంత్రికి వివరించారు. బాధితులకు సరైన న్యాయం చేయాలని కోరుతూ.. అన్ని వివరాలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
దీనిపై మంత్రి అనిత స్పందిస్తూ.. ఘటనలో నిందితుడ్ని అరెస్టు (Victime Arrest) చేశామని.. త్వరలోనే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక మోసపోయిన వారిలో ఎక్కువగా చిన్న, చితక సంపాధకులే ఎక్కువగా ఉన్నారని, దాచుకున్న సొమ్మును మొత్తం తీసుకెళ్లి మోసాగాడికి కట్టబెట్టారని అన్నారు. దీనిపై ఫిర్యాదు అందిన వెంటనే సిట్ (SIT) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిపై నరసరావు పేట ఎమ్మెల్యే అన్ని విషయాలు వెల్లడించారని, ఇందులో కొందరు పోలీస్ అధికారులు కూడా ఉన్నట్లు తెలిసిందని అన్నారు. వారిని కూడా పిలిచి ఎంక్వ్యైరీ చేయిస్తామని, బాధితులకు తప్పకుండా న్యాయం చేసి తీరుతామని హామీ ఇచ్చారు.






