పెట్టుబుడుల సదస్సుపై జగన్‌ బ్యాచ్‌ చేసే విషప్రచారాన్ని ఉపేక్షించం.. హోంమంత్రి అనిత

by Ramesh Naini |

విశాఖ పెట్టుబడుల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత వెల్లడించారు.

పెట్టుబుడుల సదస్సుపై జగన్‌ బ్యాచ్‌ చేసే విషప్రచారాన్ని ఉపేక్షించం.. హోంమంత్రి అనిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ పెట్టుబడుల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత (Home Minister Anitha) వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. సదస్సు నేపథ్యంలో సుమారు 3,500 మంది పోలీసులతో పటిష్ట భద్రత చేపట్టినట్లు తెలిపారు. సదస్సుకు వచ్చేవారు తిరిగి వారి గమ్యస్థానానికి చేరుకునే వరకు రక్షణ బాధ్యత తమదేనని అన్నారు. భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడే పరిస్థితి లేదన్నారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రమంతటా అలర్ట్ కొనసాగుతుందని చెప్పారు.

ఒకప్పుడు వలసలు వెళ్లే ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఉండేదని, ఇప్పుడు అంతా ఇక్కడికే వలస వచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ భాగస్వామ్య సదస్సుపై జగన్ బ్యాచ్ చేసే విషప్రచారాన్ని ఉపేక్షించమని హోంమంత్రి అనిత హెచ్చరించారు.

Next Story