బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలపై మంత్రి అనిత సమీక్ష

by Naga Rani Yarlagadda |

ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ పరిస్థితుల్ని సమీక్షించారు. ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లా తీరాలను తాకగా.. రానున్న 24 గంటల వరకూ రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు మంత్రి అనితకు వివరించారు.

బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలపై మంత్రి అనిత సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత APSDMA, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ పరిస్థితుల్ని సమీక్షించారు. ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లా తీరాలను తాకగా.. రానున్న 24 గంటల వరకూ రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు మంత్రి అనితకు వివరించారు. ఈ క్రమంలో అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 ఏర్పాటు చేయాలని సూచించారు.

వాయుగుండం ప్రభావంతో ఆదివారం (జులై 27) వరకు రాయలసీమ, కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటక వెళ్లరాదని తెలుపాలని హోంమంత్రి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Next Story