- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన ఓ రియల్ హీరో: కానిస్టేబుల్ వెంకటరత్నంపై హోంమంత్రి ప్రశంసలు
పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం రియల్ హీరో అంటూ హోంమంత్రి అనిత ప్రశంసించారు...

దిశ,వెబ్ డెస్క్: ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం(Traffic Head Constable Venkataratnam) ఓ రియల్ హీరో అంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు పరిధి పోరంకి(Poranki)లో ఎండలో నడిచి వెళ్తున్న పాఠశాల విద్యార్థులకు వెంకటరత్నం చలించిపోయి షాపునకు తీసుకెళ్లి చెప్పులు కొనివ్వడంపై ఆమె ప్రశ్నంసలు కురిపించారు. కానిస్టేబుల్ వెంకటరత్నం చూపిన మానవత్వం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. పౌరుల ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అర్ధం చెప్పారంటూ పొగడ్తలు కురిపించారు. విధి నిర్వహణలో వెంకటరత్నం అందించిన అమూల్యమైన సేవలకు హ్యాట్సాఫ్ అంటూ ఎక్స్‌లో ఆమె ట్వీట్ చేశారు.
ఇక విద్యార్థులకు సొంత డబ్బులతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం చెప్పులు కొనిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. కానిస్టేబుల్ వెంకటరత్నంపై ప్రశంసలు కురిపించారు.






