Home Minister: పవన్ కల్యాణ్‌ను బెదిరించిన అగంతకుడ్ని పట్టుకోండి.. డీజీపీకి హోంమంత్రి ఫోన్

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను చంపేస్తామని కొందరు గుర్తుతెలియని దుండగులు సచివాలయం(Secretariat)లోని ఆయన పెషీకి ఫోన్‌లు చేసి బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.

Home Minister: పవన్ కల్యాణ్‌ను బెదిరించిన అగంతకుడ్ని పట్టుకోండి.. డీజీపీకి హోంమంత్రి ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను చంపేస్తామని కొందరు గుర్తుతెలియని దుండగులు సచివాలయం(Secretariat)లోని ఆయన పెషీకి ఫోన్‌లు చేసి బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా.. బెదిరింపు కాల్స్ ఇష్యూపై హోంమంత్రి అనిత(Home Minister Anitha) స్పందించారు. ఏపీ డీజీపీ(AP DGP)తో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే అగంతకుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల పట్ల ఈ విధమైన చర్యలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని అనిత స్పష్టం చేశారు. కాగా, డిప్యూటీ సీఎం పేషీకి ఫోన్ చేసిన దుండగులు అభ్యంతరకర భాష మాట్లాడినట్లు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే బెదిరింపు కాల్స్‌ విషయాన్ని అధికారులు పవన్‌ కల్యాణ్‌‌తో పాటు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.

Next Story