- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండ్రోజుల్లో సీఐఐ సదస్సు.. హోంమంత్రి అనిత సమీక్ష
by Naga Rani Yarlagadda |
మరో రెండ్రోజుల్లో విశాఖపట్నంలో సీఐఐ ఇంటర్న్ షిప్ సదస్సు -2025 జరగనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మరో రెండ్రోజుల్లో విశాఖపట్నంలో సీఐఐ పార్ట్నర్ షిప్ సదస్సు -2025 జరగనుంది. నవంబర్ 14,15 తేదీల్లో ఈ సదస్సు జరగనుండగా.. హోంమంత్రి అనిత పోలీస్ ఉన్నతాధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రముఖులు, ప్రతినిధులు ఉండే హోటల్స్ వద్ద భద్రతను పెంచాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ అధికారులకు సైతం కీలక సూచనలు చేశారు. సీఐఐ సదస్సు జరగనున్న నేపథ్యంలో నగరమంతా డ్రోన్, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందన్నారు. ఇందుకు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఆర్కే బీచ్, తెన్నేటి పార్కు, రుషికొండ తీరాల్లో గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు ముందుగానే తెలియజేయాలని సూచించారు.
Next Story






