- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్నాకుళం రైలు ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి.. అధికారులకు కీలక ఆదేశాలు
ఆదివారం అర్థరాత్రి తర్వాత సుమారు 1.30 గంటల సమయంలో.. టాటానగర్ నుంచి ఎర్నాకుళం..

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం అర్థరాత్రి తర్వాత సుమారు 1.30 గంటల సమయంలో.. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో B2, M2 బోగీలు పూర్తిగా దగ్ధమవ్వగా.. ఒక ప్రయాణికుడు సజీవదహనమైనట్లు రైల్వే అధికారులు గుర్తించారు. తాజాగా ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆమె అధికారులను ఆరా తీశారు.
ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలు అగ్నిప్రమాద ఘటనలో ప్రయాణికుడు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ప్రమదం కారణంగా ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ప్రమాద సమయంలో రైలులో 2 వేల మంది ప్రయాణికులు ఉన్నారు. లోకోపైలట్, టీటీఈ అప్రమత్తతో పెనుప్రమాదం తప్పింది. దగ్ధమైన కోచ్ లను తొలగించి, ప్రయాణికులను తిరిగి అదే రైలులో గమ్యస్థానానికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు ప్రయాణికులను బస్సుల ద్వారా అనకాపల్లికి తరలిస్తున్నట్లు డీఆర్ఎం మోహిత్ తెలిపారు. సామర్లకోటలో రెండు ఏసీ బోగీలను అటాచ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.






