ఆ ‘ఎక్స్’ ఖాతాలో 80 శాతం అవాస్తవాలే.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో మహిళలు, బాలికలను రక్షించే బాధ్యత ఎన్డీయే కూటమి ప్రభుత్వానిదని హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) స్పష్టం చేశారు.

ఆ ‘ఎక్స్’ ఖాతాలో 80 శాతం అవాస్తవాలే.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలు, బాలికలను రక్షించే బాధ్యత ఎన్డీయే కూటమి ప్రభుత్వానిదని హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) స్పష్టం చేశారు. పిల్లలను రక్షించే బాధ్యతను మాకు ఎవరో గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మా బాధ్యత మాకు తెలుసు అని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు. ఈ క్రమంలో చిన్నపిల్లలపై రాజకీయాలు చేయొద్దని ఆమె తెలిపారు. ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వం(AP Government) పై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. శనివారం విశాఖ జువైనల్ హోమ్‌(Juvenile Home)ను హోంమంత్రి పరిశీలించారు. రెండు రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. విశాఖ బాలికల సదన్‌లో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని, వారు చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కొంతమంది మాత్రం మానసికంగా ఇబ్బంది పడుతున్నారని.. వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ(YSRCP) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ‘ఎక్స్’(Twitter) ఖాతాలో 80 శాతం అవాస్తవాలే అని ఫైరయ్యారు. గత ఐదు సంవత్సరాలు అబద్ధాలతో గడిపేశారు.. ఇప్పుడేమో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. తప్పు చేసిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడుతుందని ఆమె పేర్కొన్నారు.

Next Story